Saturday, April 12, 2025

నాతి చరామి

అది నిజానికి ' న అతి చరామి ' అంటే ' నిన్ను దాటి వెళ్ళను ' అని భర్త భార్య తో చెబుతాడు.. వివాహం చేసుకుంటున్నప్పుడు.

ధర్మేచ, ఆర్థేచ, కామేచ…న అతి చరామి అన్నది పూర్తి పాఠం.

ధర్మం పాటించడంలోనూ, సంపాదించడం లోనూ, కోరికలు తీర్చుకోవడంలోనూ ' నిన్ను దాటి వెళ్ళను '

అంటే.. నా ఒక్కడి కోసమే చేయను. నేను చేసే అన్ని ధర్మ బద్ధమైన కార్యాలూ నీ భాగ స్వామ్యం తోనే చేస్తాను. నీవు లేకుండా చేయను అని అర్థం.

భార్య లేనివాడు ఏ రకమైన కామ్య కారక యజ్ఞాలు చేయరాదు. భార్యకు అంత ప్రాముఖ్యత వేదం నిర్దేశం చేసింది.

బ్రాహ్మచారికి శంకుస్థాపన చేసే అధికారం కూడా లేదు.

షరా : అక్కడక్కడా ధర్మేచ……మోక్షచ అన్నది కూడా వినపడుతుంది. కానీ ఇది తప్పు. ' మోక్షచ ' అన్నది లేదు.

మోక్షం విషయం లో ఎవరి అర్హత వారిదే.


బ్రాహ్మణుడు జీవితంలో రెండుసార్లు అంటాడు. 


మెదటి సారి ఉపనయనం సమయంలో తండ్రికి మాట ఇస్తాడు.

No comments:

Post a Comment